పూల జాతర;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీక
శతాబ్దాలుగా జరుపుకుంటున్న బతుకమ్మ అతి పెద్దవేడుక

తంగేడు పూలతో అలరారు బంగారు వర్ణమై 
పుడమి తల్లి పాదాలకంటిన పసుపు పారాణియై 
పృకృతి కొమ్మకు పూసిన పచ్చల హారమై మెఱిసిపోతుంది
ఆడపడుచుల బ్రతుకు పాటకు వాడవాడల మురిసిపోతుంది

ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మదాక
తీరొక్కపూలతో ప్రతిరోజు సింగారించుకుంటుంది
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల నైవేధ్యాలు స్వీకరిస్తూ
తెలంగాణ తల్లి ఆడపడుచుల కల్పవల్లి నా బతుకమ్మ .... 


కామెంట్‌లు