"ఈనాటి రాజకీయం అంటేనే ?:" రసస్రవంతి " & " కావ్యసుధ "( విశ్రాంత సీనియర్ జర్నలిస్టులు )9247313488 : హైదరాబాదు.

 ఈనాటి రాజకీయం అంటేనే
పుట్టుకొస్తోంది  భయం !
ఆ నాటి రాజకీయమే
అనిపిస్తోంది ఎంతో నయం 
ఆనాటి నాయకుల్లో సభ్యత
సంస్కారం ఉండేది
ఈనాటి నాయకుల్లో
సభ్యత లేదు సంస్కారం లేదు
నోరు జారవిడుచుకోవడమే.
నోరు ఉన్నవానికే
ఊరన్నట్టుగా ఉంది 
ఈనాటి పరిస్థితి 
నేటి ప్రజా నాయకులు                       
 అందరూ.. కొందరు.....
ప్రగల్భాలు పలుకుతున్నారు
వ్యక్తిగత దూషణలతో
కాలం వ్యర్ధం చేస్తున్నారు
అవినీతి, దౌర్జన్యం, గుండా గిరి
వీటితో ముందుకు సాగుతున్నారు
ఈనాటి రాజకీయం కంటే 
ఆనాటి రాజకీయమే ఎంతో మేలనిపిస్తోంది
కుదురుగా మాట్లాడేవారు
కూర్చొని సమస్యలను                       
పరిష్కరించుకునే వారు
ఈ నాటి రాజకీయ నాయకులు
దురుసుగా ప్రవర్తిస్తున్నారు 
దౌర్జన్యానికి దిగుతున్నారు
విచ్చలవిడిగా అసభ్యంగా మాట్లాడుతున్నారు.
ప్రజల్లో చులకనై యిపోతున్నారు
తెలుగు భాషకు పట్టిన      
 తెగులౌవుతున్నారు.
తెలుగు భాషను                        
 బజారుకీడుస్తున్నారు
సభ్యత సంస్కారం                         
 మరిచిపోతున్నారు
కారు కూతలు కూస్తేనే 
ఓట్లు పడతాయనుకుంటున్నారు
నాయకుల భాగోతం అంతా
ప్రజలు నిత్యం తెరపై                            
 చూస్తున్నారని మరచిపోతున్నారు.
ఈపార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్లు
ఆపార్టీ వాళ్లను ఈ పార్టీ వాళ్లు 
బూతులు తిట్టుకుంటున్నారు                           
భుజాలు చరుచుకుంటున్నారు                          
తొడలు కొట్టుకుంటున్నారు                          
  మేమే తోపుగాళ్ళ మంటున్నారు
మాకు ఎదురు లేదు
మాకు బెదురు లేదు                                                          
    మేము మారని వాళ్ళం                                                                         
మంచివాళ్ళతో చేరని వాళ్ళం                             
నరం లేని మా నాలికతో
మా ఇష్టానుసారం                        
 తిట్టుకుంటాం
మాకు మంచి వాళ్ళమాటలు                        
  వినబడవు
మంచి వాళ్లు మాకు కనబడరు                           
మేం పట్టిన కుందేటికి మూడే కాళ్ళు..... 
అనే..... తత్వం 
బూతులు మాట్లాడుతున్న నాయకుల
మూతులకు వాతలు పెట్టండి!
సూదులతోమూతులు కుట్టండి!
ఎవరికి వారే జబ్బలు చర్చుకోకుండా
పార్టీల పరువు పోకుండా
నోరు అదుపులో పెట్టుకోండి !
ప్రజల మనస్సు నాకట్టుకోండి!
ప్రజల మనస్సుల్లో                          
 గూడుకట్టుకోండి !!
అప్పుడే రాజకీయ నాటకం                      
  రక్తి కడుతుంది.
అయినా.... అయ్య బాబోయ్ 
ఈనాటి రాజకీయం అంటేనే
పుట్టుకొస్తోంది భయం!
ఆనాటి రాజకీయమే
అనిపిస్తోంది ఎంతో నయం.!
కామెంట్‌లు