ప్రకృతి పూల జాతర;-'రసస్రవంతి' & ' కావ్యసుధ '9247313488 : హైదరాబాదు
 బతుకమ్మ పండుగ వచ్చిందంటే
వనంలో విరబూసిన పూలన్నీ
మహిళల చేతుల్లో గౌరమ్మలై,
బతుకమ్మలై కొలువు దీరుతాయి
సాయంకాలపు చిరుగాలులన్నీ
స్త్రీల స్వరాలతో కలిసి రాగాలవుతాయి
మహిళామణుల చేతిగాజుల
గలగలలు తాళాలవుతాయి
మగువల మనసులోని భావాలన్నీ
జానపద పల్లవులై ప్రవహిస్తాయి 
బతుకమ్మ పాటలై తెలంగాణమంతా
ప్రతిధ్వనిస్తాయి
బతుకమ్మ తెలంగాణ పల్లెల
సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మ
మహిళల పుష్ప కళా నైపుణ్యానికి ప్రతీక
రకరకాల రంగురంగుల పూలతో
పేర్చిన బతుకమ్మ
ఇది ప్రకృతి పూల జాతర.
ఆటపాటలతో బతుకమ్మను పూజించుట.
వాడ వాడల్లో అపురూప వేడుక.

కామెంట్‌లు