బతుకమ్మ బ్రతుకు ఉయ్యాలో..........:-" కవన భూషణ" " కవన సాగర " ' రస స్రవంతి '& ' కావ్యసుధ ' 9247313488 హైదరాబాద్.
 కాలం స్త్రీపురుష రూపాత్మకం
చైత్రం,  భాద్రపదం
పురుష రూపాత్మకం
ఆశ్వయుజ, ఫాల్గుణ మాసం                            
 స్త్రీ రూపాత్మకం
శ్రీరూపాత్మకమైన
ఆశ్వయుజ పాడ్యమితో
తొమ్మిది రోజులు శక్తి ఆరాధన.
శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే
బతుకమ్మ పండుగ
తెలంగాణ జానపద సంస్కృతి                           
సంప్రదాయాల ప్రతిబింబం.
శరదృతువులో బంతి,                          
 చామంతి ,తంగేడు, గునుగు,                        
  రుద్రాక్ష పూలు విరగబూస్తె,
ఆ పూలకు.......
అందమైన రూపం మిచ్చి,                          
ఒక్కొక్క తీరు "బతుకమ్మ" పేర్చి 
మగువలు కీర్తించే పండుగ.
ఆది కాలమునుండి
అనేక రూపాల్లో
పూజింపబడే జగన్మాతను
ఆశ్వయుజ మాసములో
తొలుత 'బొడ్డెమ్మ' గా కన్యలు         
తర్వాత' సద్దుల బతుకమ్మ 'గా                           
 అతివలు, ఆడపడుచులు 
బతుకునిచ్చే తల్లిగా.......
సిరిసంపదల కల్పవల్లిగా......
బతుకమ్మ పాటలతో
కోలాటం ఆటలతో 
ఆరాధించే రోజు.......
బతుకమ్మ ప్రకృతి పండుగ.
పల్లెటూర్లలో, పట్టణాల్లో 
తెలంగాణ జానపద
సంస్కృతి పుత్రిక.
తెలుగు సంప్రదాయానికి ప్రతీక
ఈ బతుకమ్మ పండుగ 
చిన్న, పెద్ద, పేద,ధనిక
తారతమ్యం లేకుండా                                                      
ఏడురోజులపాటు                            
  ఆడుకునే ఉత్సహం
గునుగు,తంగేడు,గుమ్మడి                          
 బంతి ,చేమంతి ,జాజి                              
రంగురంగుల పూలతో
రకరకాల సిబ్బులల్లో                              
గుండ్రంగా పేర్చి
పసుపు గౌరమ్మను చేసి                           
అలంకరించి పూజించి
మహిళలంతా గుంపులుగా చేరి
మధ్యలో బతుకమ్మను పెట్టి
వలయాకారంగా తీర్గుతూ 
చప్పట్లు కొడుతూ..........
ఉయ్యాల పాటలతో 
ఆడి పాడే పాట                                
ఆనందాల పూదోట
ఆటతో...పాటతో....అలసిన                          
మహిళామణులు
తుదకు బతుకమ్మను
దగ్గరలో ఉన్న..........
చెరువుల్లోనూ,  కాలువల్లో 
నిమజ్జనం చేసి.........
పప్పు, ఫలహారాలను
అటుకులు , బెల్లంను
వాయనంగా ఇచ్చుకుంటారు
ఇచ్చుకున్నది ఇంటికి తెచ్చుకుంటారు.
గౌరీ దేవి ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరిస్తారు 
ఆనందం నిండగా బతుకుల్లో 
దండిగా జరుపుకునే
బతుకమ్మ పండుగ.

కామెంట్‌లు