చిత్రానికి పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
చెరువున పూచెడి పూలివి
తరువుకు దాపునను నిలచితామర పూలన్
మురియుచు పట్టెను బాలుడు
యిరు కరములనిండ చూడ యింపునుగూర్చెన్
ఆ.వె
అల్లిపూలుయనుచు యరుదుగా పిలిచేరు
చెరువులోనిపూలు చేత నిండ
యీత కేగె నేమొ యింపైన పూలకై
తెల్ల కలువలండ్రు తేటగాను
తే.గీ
కొలను యందలి పూలను కోసితెచ్చి
చెట్టు నీడన బాలుడు చేతినిండ
తెల్ల తామర లనియెడి అల్లిపూల
పట్టి చూపుచు నుండెను పరవశమున

కామెంట్‌లు