చిత్రానికి పద్యాలు;-మమత ఐలహైదరాబాద్9247593432
 ఉ.
మువ్వల వెండిగజ్జెలకు పచ్చని యెర్రని రంగులందమై
సవ్వడి జేయుచుండునవి చక్కని పాపయె గంతులేయగన్
నివ్వెర పోయెటందమును నిక్కము జూపును కాళ్లకెప్పుడున్
నవ్వును గాంచ దృష్టియని నల్లని దారము కట్టిరే కనన్
ఆ.వె
పాప కాళ్ళు మెరిసె పట్టీలు వేయగన్
నల్ల దిష్టి తాడు నంద మొలిక
చిట్టి పాదములకు సిరిమువ్వ గజ్జెలు
అడుగు లేయ మ్రోగు నందె లెపుడు

కామెంట్‌లు