దత్తపదులు:;-మమత ఐలహైదరాబాద్9247593432
 -పప్పు చారు పెరుగు కూర
ఉ.
పప్పుల నెయ్యి వేయ రుచి వచ్చుచు జిహ్వకు నింపుగూర్చుచున్
తప్పక పప్పుచారు రుచి దక్కునుభా‌రత దేశమందు నన్
వొప్పుగ దుంపకూర పరి పూర్తిగ లేదని కుక్షి జెప్పుచున్
చెప్పును మీగడై పెరుగు చిక్కగ నుండ పసందుయౌననిన్
ఆ.వె
పులుసుపప్పు మరుగ మునగ కాడలు చేర్చ
చారుబదులు పులుసు సాంబరగును
కూరలందు దుంప కూరెంత మధురము
పెరుగు గరిటెడైన మరువమెపుడు
ఆ.వె
పగటి భోజనంబు పంచామృతంబగు
పప్పు చారు పెరుగు నొప్పు ;కడన
పచ్చకూరనైన పరిపూర్తి యగుసుమా
మనసు పెట్టి వినుము మమతమాట
తే.గీ
అతి మధుర మండ్రు పప్పులో నావకాయ
కూరలందున వంకాయ కూర మేటి
చారు లేనట్టి భోజనం చప్పిడండ్రు
పెరుగు మీగడలున్నను తిరుగులేదు

కామెంట్‌లు