దత్తపదులు:-మమత ఐలహైదరాబాద్9247593432
 అతుకు వెతుకు మెతుకు బ్రతుకు
క.
అతుకుల బట్టలె ఫ్యాషన్
వెతుకుచు ధరలధికమైన వేసిరి గొనుచున్ 
మెతుకులు తినుటను మానిరి
బ్రతుకున బర్గర్లు పీజ బహుళంబాయెన్
 దత్తపది:-
అతుకు వెతుకు మెతుకు బ్రతుకు
చ.
అతుకుల చొక్క వేసినను యాకలి దప్పులకోర్వజాలరే
వెతుకుదురాగ కుండమరి వేదన దీర్చెడి విద్యనెంచుచున్
మెతుకులు పట్టెడైనగని మిక్కిలి సంబరమొందుచుందురే
బ్రతుకనుబాట నెంచుకొని భావితరమ్మునభాగ్యులెప్పుడున్
దత్తపది:- ఇరుకు ఉరుకు కరుకు నరుకు
క.
ఇరుకైన మనస్తత్వము
నురుకుమనిన విషము జిమ్ము నువిదన యెపుడున్
కరుకుతనము వధ్దనుచున్
నరుకుటయెంచిన పిదపనె నమ్రత బోవున్

కామెంట్‌లు