చిత్రానికి పద్యం;-మమత ఐల-హైదరాబాద్-9247593432
 ఉ.
తెల్లని వెన్నకుండలను తిన్నగ బెట్టెను కాళ్ళపై మరిన్
మెల్లని మందహాసముతొ మీగడ కుండల వెన్నదీయుచున్
పిల్లనగ్రోవి వీడకను పిల్చిన యట్లుగ జూచుచుండెనే
నల్లని పిల్లవాడుమరి నందకి షోరుని చూడశోభలే


కామెంట్‌లు