చిత్రానికి పద్యాలు;-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
గునుగు బంతి కట్ల గోరింటతంగెడు
ముద్ద గౌరిదేవి మధ్యలోన
చక్కని బతుకమ్మ సౌందర్యమున గొప్ప
మనసు పెట్టి వినుము మమతమాట
ఉ.
గుమ్మడి పూవులాకులతొ కొత్తని చిబ్బిన గౌరిదేవిగన్
సొమ్ములు బెట్టినట్టుగనె చుట్టుగ బేర్తురు పూలునిండుగన్
కొమ్మలకున్న తంగెడిని కోరిక మీరగ దెచ్చుకుందురే
యమ్మను పూలదైవమనుచందులొ  గౌరినిమధ్య జేర్తురే
కామెంట్‌లు