దొంగలను పట్టిచ్చిన విద్య:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  ఆసక్తి, కృషి ఉండాలే గానీ ఏ విద్య అయినా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది.అటువంటి
కథే ఇప్పుడు చెప్పుకుందాం.
        వేణూకి ధ్వని అనుకరణ విద్యలో మంచి ప్రవేశం ఉంది.అతను ప్రముఖుల గొంతును అనుకరించి మాట్లాడగలడు.అదిగాక అనేక మంది మాట్లాడుతున్నట్టు తనే మాట్లాడుతూ భ్రమకలిగించే వాడు.
         ఒకరోజు వేణు పని మీద వేరే ఊరికి వెళ్ళి అర్థరాత్రి ఊరు చేరుకున్నాడు.శివాలయం దగ్గరకు రాగానే గుడిలో ఏదో అలికిడి వినిపించింది,మెల్లగా తలుపు సందులోంచి చూస్తే దేవుని హుండీ దగ్గర ఇద్దరు తచ్చాడుతూ హుండీని మెల్లగా పగుల గొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడింది!
       అంతే తన ధ్వని అనుకరణ విద్యను ఉపయోగించి దొంగల ఆట కట్టించాలనుకున్నాడు.
ఒక్కొక్కసారి ఒక్కొక్కరకమైన గొంతుతో మాట్లాడాడు, మరలా అందరూ కలసి మాట్లాడుతున్నట్లు గట్టిగా మాట్లాడాడు.అంతే దొంగలు బయట చాలామంది ఉన్నారనుకుని ధ్వజస్థంభం దగ్గర నక్కారు.వెంటనే చాకచక్యంగా పక్కింట్లో నిద్ర పోతున్న వారిని లేపి గుడిలో దొంగలు పడినట్టు అప్రమత్తం చేశాడు.
        పక్కింటిలోని యువకుడు పరుగున ఊరి కొత్వాలు వద్దకు వెళ్ళి దొంగల విషయం చెప్పాడు. వెంటనే కొత్వాలు రక్షకభటులను పంపి ఆదొంగల చేతులకు సంకెళ్ళు వేయించాడు.
     ఈవిషయం పంచాయితీ అధికారికి తెలిసింది,వేణు విద్యను మెచ్చుకుని మంచి బహుమతి ఓ సభలో ఇచ్చాడు.
       వేణూని ఊరి ప్రజలు మెచ్చుకున్నారు.
            

కామెంట్‌లు