మంచివాడికి సహాయం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 సంతోష్ ఎంతో మంచివాడు.తన చేతనైనంతలో అవసరం ఉన్నవారికి సహాయం చేసేవాడు.బీద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించేవాడు.
        ఒకరోజు సంతోష్ ఊరు బయట ఏదో పని ఉంటే  చూసుకుని వస్తుంటే పొరపాటున ఒక రాయి తగిలి పడిపోయాడు.కాలు బెణికి అక్కడే కూర్చున్నాడు.
       అంతలో చెట్టు పైనుండి ఒక పక్షి సంతోష్ కూర్చున్నదగ్గరే పడింది సంతోష్ కి  కాలు అంతనొప్పిగా ఉన్నా తన దగ్గర ఉన్న సీసాలోని నీళ్ళను ఒక దోనెలాంటి రాయిలో పోసి తాగించాడు.
ఆ పక్షి నీళ్ళను తాగి ఎంతో కృతజ్ఞతతో సంతోష్ వైపు చూసింది.నొప్పి ఉన్నా సంతోష్ తాను చేసిన సహాయం అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
       అప్పుడే అటువస్తున్న జగదీష్ అనే ముని సంతోష్ పక్షికి చేసిన మేలును, అతని మంచితనాన్ని గ్రహించగలిగాడు.
         "నాయనా సంతోష్ నీవుచేసిన మేలు నా శక్తితో తెలుసుకోగలిగాను, నీవు నీ పరిధిలో అవసరమున్నవారికి చేస్తున్న మేలును కూడా గ్రహించగలిగాను,నీలాటి వారి అవసరం సంఘానికి ఈ రాజ్యానికి అవసరం,అందుకే ఒక  మంత్రం నీ మెదడులో నిక్షిప్తం చేస్తున్నాను,దాని వలన నీవు తలచుకుని అవసరం ఉన్న వారికి మేలు చేయగలవు" అని చెప్పి ఆశీర్వదించాడు.
       జగదీష్ కి నమస్కారం  పెట్టాడు అతని కాలి నొప్పికూడా మాయం అయింది.
       సంతోష్ తిరిగి నగరానికి వెళ్ళాడు.అప్పుడే అతనికి ఒక వార్త తెలిసింది.ఆ రాజ్యాన్ని పరిపాలించే ధీరజ్ కి ఒక ప్రమాదం ముంచుకొచ్చిపడింది.ఏమిటంటే  పక్కరాజ్యం రాజు వినీత్ అతిబలవంతుడు అతనికి ధీరజ్ సైన్యంకంటే చాలా ఎకువ సైన్యం ఆయుధాలు ఉన్నాయి అతనిని గెలవడం చాలా కష్టం .సంతోష్ కి ఈ విషయం తెలిసింది.వెంటనే సంతోష్ ధీరజ్ దగ్గరకువెళ్ళి ఆ వినీత్ ను తాను ఓడించగలనని చెప్పాడు.
       సంతోష్ మాటలు విని ధీరజ్ ఆశ్చర్యపోయాడు.అతని ఆశ్చర్యాన్ని గమనించిన మంత్రి శరత్ ఈ విధంగా చెప్పాడు.
       "మహారాజ ధీరజ్ అంత ధైర్యంతో చెబుతున్నాడంటే నాకు అతని మీద నమ్మకం కలుగుతోంది" అని చెప్పాడు.
      ఏ విధంగా అంతపెద్ద సైన్యాన్ని ఎదుర్కొనగలవు?" అడిగాడు.
   "మీ భటుల్లో బలవంతుణ్ణి నాతో ద్వంద యుద్ధం చేయమనండి" అని చెప్పాడు సంతోష్.
      "భార్గవా సంతోష్ తో కత్తి యుద్ధం చేయి" అని తన బలవంతుడైన సైనికుడికి చెప్పాడు.
      వెంటనే భార్గవ కత్తితీసుకుని సంతోష్ మీదకు వచ్చాడు,సంతోష్ కి కూడా ధీరజ్ కత్తి ఇచ్చాడు.
    ఇద్దరూ ద్వంద యుద్దానికి  తలబడ్డారు.ఒక్కసారి కత్తి ఝళిపించి సంతోష్ మంత్రం జపించాడు, అంతే భార్గవ్ విచిత్రంగా కత్తి తిప్పలేక పడిపోయాడు. అప్పుడు సంతోష్  శక్తి ధీరజ్ కి అర్థం అయింది.
 మంత్రి శరత్,ధీరజ్ సంతోష్ మీద నమ్మకంతో వినీత్ మీద యుద్ధానికి పంపారు.
          యుద్ధ భూమికి సంతోష్ ఒక కత్తితో మాత్రం వెళ్ళాడు.వెనుక ధీరజ్ సైన్యం నిలబడింది.
       సంతోష్ కత్తీతీసి ఝళిపించాడు.అంతే ఆ కత్తి నుండి వేలమంది భయంకర సైనికులు వెలువడ్డారు. ఆహఠాత్పరిణామాన్ని చూసి వినీత్ అతని సైన్యం ఆశ్చర్యపోయారు.
        ఇక లాభంలేదని వినీత్ తెల్లజెండా ఊపి ధీరజ్ తో సంధి చేసుకున్నాడు.
    సంతోష్ తన మంచితనంతో సాధించిన వరంతో యుద్ధం, రక్త పాతం నివారించాడు.
       మంచితనంతో ఉంటే  మనకు తెలియకుండానే మంచి దీవెనలు తప్పక ఉంటాయి.
            

కామెంట్‌లు