*కవిత్రయులు*:-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 *సీసం*
దున్నయిద్దాసులు తొలితరంబుదళిత
కవిగానెయెదిగెను గౌరవముగ
గుర్రము జాషువా గొప్పగరచనలు
జేసెనుచక్కగా జీవితమున
బోయిభీమన్నయే పొత్తము లెన్నియో
వ్రాసెను సాహిత్య వనమునందు
మూడనమ్మకముల ముందుతిరగబడి
పోరాటమునుజేసె పొందుగాను
దళితకుటుంబాన ధన్యులైవెలగొందె
ముగ్గురు మూర్తులు ముదముతోడ
అన్యాయమెదిరించి హక్కులకోసమై
తిరగబడెనువారు తేజముగను
*తేటగీతి*
సాహితీలోకమందున శ్రద్ధగాను
సేవ లందించిరిలపైన స్థిరముగాను
కృషిని జేసిరి సతతము క్షేమమెంచి
ప్రజల మనసులు గెలిచిరి నిజముగాను
కామెంట్‌లు