బంగారు బతుకమ్మ:-బెజుగాం శ్రీజ--గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట--చరవాణి:9391097371

 1.
గుమ్మడాకుపరచి గునుగుతంగెడిపూలు 
కలిపి పేర్చుతారు కౌతుకమున
వరసపూలుకలిపి బంగారుబతుకమ్మ
పేర్చు వనితలంత వేడ్కజేయు
2.
ఆడపడచులంత ఆనంద ముప్పొంగ
వాడ లందు పెట్టి పాటపాడి 
బతుకునిచ్చు తల్లి బతుకమ్మయనివేడి
సంతసించుతారు సర్వజనులు
3
బాలలంతకలిసి బతుకమ్మ చుట్టును
పాటలన్నిపాడి పరవశించి
కడకు గంగలోన గౌరమ్మనువిడిచి
ఇంటి కేగుతారు యిష్టముగను
కామెంట్‌లు