శక్తి సమన్విత!;-డా. పి. వి. ఎల్. సుబ్బారావు,విజయనగరం9441058797

 1.నేటి మహిళ ధాటి,
               అవరోధాలు దాటి!
   లక్ష్యం చేరుకోవడంలో,
                సాటిలేని మేటి!
   బంధం,పాత్ర ఏదయినా,
         ఆ రూపం అపురూపం!
   ఆమె నిత్యాష్టావధాన,
       మహాధ్యానసంధాయిని!   బతుకు పోరాటాన,
   నిలబడిన మరోఝాన్సీరాణి!
2.ఆంక్షలు దాటుకుంటూ,
     ఆదర్శాలు అందుకుంది!
   ముదమార నేర్పిన ముదిత,
          నేర్వని విద్య లేదంది!
   సమానత్వం దాటి ఆధిక్యం,
       దిశగా వేగం పెంచింది!
   వెనుకబాటుతనం, వెనక్కి,
     నెట్టి ముందడుగు వేసింది!
  ఏరంగంలోనైనా నారీశక్తి,
         జయభేరి మోగిస్తోంది!
3.విద్యావంతురాలిగా,
         వివేకం కూడ కట్టింది!
   గృహవికాసవృత్తకేంద్రం,
           ఆత్మీయతాసంద్రం!సహించలేని వాళ్ళు 
సంధించే, విమర్శనాస్త్రాల్ని తిప్పికొట్టింది!
 అనసూయలా నిలబడింది,
      అవలీలగా ఎదిరించింది! 
ప్రమద ప్రతిజ్ఞ నిర్వహణలో,
          అసమాన ప్రజ్ఞానిధి!
4.నాడు సత్యభామ ఎదుట,
            ఒక్క నరకాసురుడే!     నేడు ప్రతిభామకు,
   అడుగడుగునా అడ్డుఅయ్యే!
  రావణులు,కీచకులు,
          దుశ్శాసనులు, వారికి!
    తోడుగా నిర్భయాంతకులు,           
       నిత్యం పుట్టుకొస్తున్నారు!
   భామినికి భద్రత లోపించిన,
               రోజులంటే ఇవే!
5.భామ బొమ్మా! ఆడేసుకుని,
       నేలకేసి పగలకొట్టడానికి!
మహాదుర్గ! దుష్టులకుత్తుకలు,
             తెగనరుకుతుంది! కళ్ళనుండినిప్పులుచిమ్ముతూ,
            వీరవిహారం చేస్తుంది!
 ఉయ్యాల ఊపిన చేతులే,
       ఉప్పెనలై ఉద్యమిస్తాయి!
మానిని మానప్రాణాలపై,
     కన్నేస్తే భస్మం చేసేస్తాయి!
------------------------------------
దుర్గాష్టమి శుభాకాంక్షలతో,

కామెంట్‌లు