ఆత్మవిశ్వాసం ... సూక్తులు- సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414, peddissrgnt@gmail.com

 @ ఆత్మవిశ్వాసమే అఖండ విజయానికి అసలు రహస్యం. ఆర్.డబ్ల్యూ.ఎమర్సన్
@ ఆత్మవిశ్వాసం అనే మౌలికాంశం చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతుంది. 
@ ఆత్మవిశ్వాసం అన్నింటికన్నా చాలా గొప్పది.
@ ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. వివేకానంద
@ ఆత్మవిశ్వాసం గలవ్యక్తి బలవంతుడు.  సందేహాలతో సతమతమయ్యేవాడు బలహీనుడు.  ఫీ మాన్ క్లార్క్ 
@ ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి  ప్రారంభమైనట్లే. అది సడలకుండా ఉంటే  విజయం వరిస్తుంది. అబ్దుల్ కలాం
@ ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలతో అనేకమంది నాయకులయ్యారు.
@ జీవితంలో ఉన్నతులుగా నిలబెట్టేవి సత్ర్పవర్తన, అభ్యాసం, ఆత్మవిశ్వాసం. జాన్ సన్
@ ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం – ఈ మూడింటితోనే చాలా మంది సామాన్యులు నాయకులైనారు. ఫ్రాంక్లిన్
@ నాణ్యత చూపించు, ఆత్మవిశ్వాసం కలిగి ఉండు, శీలాన్ని ప్రదర్శించు. గెలుపు దానంతట అదే వస్తుంది.
@ విజయానికి ఆత్మవిశ్వాసం ఒక మార్గం, ఆత్మవిశ్వాసానికి ముఖ్యం సన్నద్ధత.
@ వ్యక్తి బృందంగా మారితే సంఘటిత కృషివల్ల ఆత్మవిశ్వాసం, అద్భుతాలు వాస్తవరూపు దాలుస్తాయి.
@ శ్రద్ధ అంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే మనిషికి భగవంతుడిపై ఉండే విశ్వాసం. గాంధీజీ

కామెంట్‌లు