సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

 ఉత్సాహము
@ ఉత్సాహం లేనిదే ఎప్పుడూ ఏ గొప్పపనిని సాధించలేదు.  రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
@ ఉత్సాహం,ఉల్లాసం ఉంటే  వృద్ధులయినా మొహంలో యువకాంతులు మెరుస్తాయి. చార్లెస్ డికెన్స్
@ ఉరిమే ఉత్సాహం, దృఢ కోరిక మందమతులను సైతం మహోన్నతులను చేస్తుంది.   శివ ఖేర. 
@ ఏ గొప్పపనైనా, ఎంత అద్భుతవిజయమైనా ఉత్సాహం తోడులేనిదే సాధ్యపడదు.  ఎమర్సన్
@ ధైర్యంగా, నిర్మొహమాటంగా చేసే విమర్శ బాగుపడటానికి సాయపడుతుంది. ముందుకు అడుగువేసే ఉత్సాహం కలిగిస్తుంది. చేసే పనిలో లోపాలు సరిదిద్దుకొనేటట్లు చేస్తుంది. ఎ. ఎ. జడనోవ్
@ నిర్భయత్వం, సహనం, ఉత్సాహం. ఈ మూడూ మనిషిని నిత్య సంతుష్టుడిని చేస్తాయి.  నేతాజీ
@ పేదరికం సహజది కాదు, అది కల్పించబడింది.  ఇతరులపై ఆధారపడటం, అసమర్థత, సోమరితనం, తన కాళ్ళమీద తాను నిలబడాలన్నా ఉత్సాహం లేకపోవడమే పేదరికానికి అసలైన కారణాలు.మోక్షగుండం విశ్వేశ్వరయ్య
@ మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.
@ మీలో ఉత్సాహం ఉల్లాసం ఉన్నట్లయితే మీరు  వృద్ధులయినా మీ మొహంలో యువక కాంతులు మెరుస్తుంటాయి. చార్లెస్ డికెన్స్
@ వయసు మళ్లితే ముఖం ముడతలు పడుతుంది, చొరవ, ఉత్సాహం వదిలివేస్తే మనస్సు ముడుచుకుపోతుంది.
@ విమర్శ లేకపోతే ఏ వ్యాధి అయినా గట్టిగా పాతుకుపోతుంది. దానిని నయం చేయడం కష్టం.  ధైర్యంగా, నిర్మొహమాటంగా చేసే విమర్శ  బాగుపడటానికి సాయపడుతుంది.  ముందుకు అడుగువేసే ఉత్సాహం కలిగిస్తుంది. పనిలో లోపాలు సరిదిద్దుకొనేటట్లు చేస్తుంది. 
@ సామర్థ్యం కన్నా ఉత్సాహం మిన్న, ఉత్సాహం కన్నా ఆచరణ మిన్న. వివేకానంద
@ సౌహార్దం, దయ, ఉత్సాహం, ఓర్పు అనే నాలుగు సద్గుణాలు కలిగిన వాడే నిజ శిక్కు.   గురునానక్

కామెంట్‌లు