అన్నపూర్ణా సదాపూర్ణా;-మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్--చరవాణి:9441139106
 అన్నపూర్ణా సదాపూర్ణా;
సచ్చిదానంద రూపిణీ ముక్తికాంతా పతేశ్శంభో వర్ధతే ధర్మ దేవతా
తస్యాంస్తు పూజాంయఃకుర్యాత్
నిత్యాన్నం లభతేన్నరః
వర్తతేచ పితృణాంహి ముక్తిహేతుం కరాణ్యపి!!
సీసము
ఏదేవి శంభుని కేక కాయమునిల్చి
యేలుచుండును జగతినింతి సతిగ
ఏదేవి పశుపతి శ్రీమతి రూపమై
పాడి పంటలపంచు వైభవమున
ఏదేవి గంగమ్మ భూదేవి తడుపగా
పచ్చ పైరులనిల్చు ముచ్చటగుచు
ఏదేవి జీవుల కిచ్చునోగిరమంత
క్షుత్పిపాసలు బాపి సుఖము కోరు
తేటగీతి
అట్టియన్నపూర్ణాదేవిననవరతము
సచ్చిదానందరూపమైశరణమంటు
కొలిచి ప్రణుతులు జేసెద గుండెలోన
ముక్తి నాథుని ముగుదను భక్తి తోడ

కామెంట్‌లు