జాతరొచ్చె(జానపద గేయం):-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

జాతరొచ్చె జాతరొచ్చెనమ్మా
జయమ్మా ఓమా విజయమ్మ
మన ఊరి జాతరొచ్చెనమ్మా
వినవమ్మా నీవిక కనవమ్మా !

జాతరొచ్చె జాతరొచ్చెనమ్మా
జయమ్మా ఓమా విజయమ్మా
మన ఊరికి పేరు తెచ్చెనమ్మా
ఘన తేరుకి విలువ హెచ్చెనమ్మా !

జాతరొచ్చె జాతరొచ్చెనమ్మా
జయమ్మా ఓమా విజయమ్మా
మన కుల దేవత జాతర ఎల్లమ్మ
తెలుసుకొని రావమ్మా ఓబుల్లెమ్మా

జాతరొచ్చె మన జాతరొచ్చె
జన జాతర జోరుగూడ హెచ్చె
పోయి వద్దామా ఓ జయమ్మా
చూసి వద్దామా మా విజయమ్మ!

ఊరోళ్ళందరూ పోతున్నరూ
చూసి మళ్లీ తిరిగి వస్తున్నరూ
జయమ్మా ఓ మా విజయమ్మ
మనం కూడా పోయొద్దమమ్మ !

నువ్వొస్తే రంగుల రాట్నం ఎక్కిస్తా
శ్రీరంగ పట్నంనే ఇక నే చూపిస్తా
కొత్త పట్టు చీర కోకనూ నే ఇప్పిస్తా 
పట్టు పట్టి నే నీప్రేమ జపం నేచేస్తా

నీ చెవులకు లోలోకులు పెట్టిస్తా
నీ ముక్కకు ముక్కెరను కుట్టిస్తా
జాతరలో ఉట్టిని నీతో నేకొట్టిస్తా
ఆ దేవతకు నీతో దీపం పెట్టిస్తా !

జాతరొచ్చ జాతరొచ్చె జయమ్మ
జనం మెచ్చే జాతరొచ్చె విజయమ్మ
జాతరంత తిరిగి తిరిగి నే చూపిస్తా
దారి మరవకుండా నీవెంటే నే వస్తా

నీ వెప్పుడు నా చేతిని విడవకు
నే చేయిస్తా వడ్డానం నడుముకు
 ఇక నే చూపిస్తా మన ఊరి జాతర
చకచక ఊరేగుతుంది దుర్గమ్మ మాతర !

రావే రావే జయమ్మ ఓ విజయమ్మ
మన కుల దేవతకు మొక్కేద్దాం మనమమ్మ
మనం మక్కువతో మొక్కితే ఆతల్లికి
చిక్కులే లేకుండా చేస్తుంది మన పెళ్ళికి !

కామెంట్‌లు