దేవీ నవరాత్రులు-వాని ప్రాశస్త్యం .--ఓ సంక్షిప్త పరిశీలన-విషదీకరణ.:గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్ .9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

 ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు. ఈ నవరాత్రులలో
శ్రీ లక్ష్మి దుర్గా అవతారమెత్తి, 9 మంది రాక్షసులతో యుద్ధము చేసి
వారిని సంహరించిన అనంతరం పదవరోజున విజయము సాధించి నందున ఆ రోజుకు విజయదశమి అని పేరు వచ్చింది. దశహర కాబట్టి దసరా అయ్యింది.
      ఈ తొమ్మిది రాత్రులను దేవీ నవరాత్రులు, లేదా దుర్గా నవరాత్రులు అని కూడా వ్యవహరిస్తారు. పండిత పామరులు అందరికీ శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత లేదా దేవి మాత అప్పటినుండి ఆరాధ్య దైవము అయింది. దేవీ నవరాత్రుల్లో ఈ శ్రీదేవిని వన బాల వాసవి, లలిత త్రిపుర సుందరి, చండి, గజలక్ష్మి, ధనలక్ష్మి, పంచముఖ గాయత్రి, కాళికాదేవి, సరస్వతి, మహిషాసురమర్దని, పుష్ప శయ్య, రూపాలలో సుందరంగా అలంకరిస్తారు.
అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణ, మహాగౌరి, శారద, బాల త్రిపుర సుందరి, సంతానలక్ష్మి, పర్వత వర్దిని, వనదుర్గ, కామేశ్వరి, రాజరాజేశ్వరి రూపాలలో అలంకరించి నవరాత్రులలో ఆ దేవిని పూజించడం పరిపాటి. విష్ణు మాదిరిగానే పార్వతీదేవి కూడా దశావతారములు ఎత్తిందని ఒక్కొక్క అవతారంలో దేవి రాక్షసులను సంహరించి ప్రజలను రక్షించిందని మన పురాణములు ప్రవచిస్తున్నాయి. మార్కండేయ పురాణంలో దేవి మహత్య ఘట్ట మందు దేవి రాక్షసులను వధించిన వృత్తాంతము వివరించబడింది.
             మొదటి అవతారం లో దేవి మధుకైటభ రాక్షసుల మరణానికి కారణమైయింది. రెండవ అవతారం లో మహిషాసురుని వధించింది. మూడవ అవతారంలో శుంభనిశుంభలను వధించింది. నాలుగో అవతారంలో కంసుని సంహరించింది. ఐదవ అవతారం లో దంత రాక్షసుని వధించింది. ఆరవ అవతారంలో శాకంబరి దేవిగా అవతరించి ప్రజలకు శాకములను(ఆకుకూరలు) అందించి కరువు కాటక ముల నుండి కాపాడింది. ఏడవ అవతారం లో దుర్గుడను రాక్షసుని వధించింది. ఎనిమిదవ అవతారం లో మాతంగి మాత గా జన్మించింది. తొమ్మిదో అవతారంలో లబ్రిమారిదేవిగా అవతారములను దాల్చింది
         ఇలా 9 అవతారాలలో దేవి దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుని వధించి, ఉగ్రరూపాన్ని దాల్చినప్పుడు, ఆమెను ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు జరుపుకునే పూజలే నేటి దేవీ నవరాత్రులు గా మారాయని చెబుతుంటారు.
         మనం కూడా మన అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు మనసారా పూజించి ఆ తల్లి దీవెనలు అందుకుని తరిద్దాం.
జై దుర్గ భవాని-జై దుర్గ భవాని.
కామెంట్‌లు