పనిఒత్తిడి పిల్లలం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
నింగిలోన మెరుస్తున్న
చుక్కలాంటి పిల్లలం
నేలలోన తడుస్తున్న
మొక్క లాంటి మల్లెలం!

వంతుల వారి బృందగానం
పంతంతో కోరుకున్న వారలం
పూబంతులను మేము కోరి
బృందావనం చేరుకున్న పోరలం !

మేమంతా స్వయం ఉపాధి మా
పనులను స్వయంగా చేపడతాం
మా ధ్యేయం దుబారా ఘనులను
 వ్యయం చేయకుండా చీకొడతాం !

మేం శ్రమ శక్తిని గుర్తింస్తాం
పొద్దంతా బాగా పని చేస్తాం
మా ప్రభు భక్తిని అర్థిస్తాం
మా డబ్బంతా కొనితెస్తాం!

మేమంతా ఆ పని ఈ పని
అనకుండా  విసుక్కోకుండా
దినమంతా ఓర్పుతో పని చేస్తాం
దిన బత్యం నేర్పుతో సంపాదిస్తాం !

మేం మా పని ఒత్తిడిని తట్టుకుంటం
మా గాని లోని మత్తడిని కట్టుకుంటం
గుడుంబా అమ్మకాన్ని అరి కడతాం
కుటుంబం నమ్మకాన్ని నిలబెడతాం !

సదా గురుకుల మందు తిరుగుతాం
వేద గురువుల పొందు కోరుతాం
ఓంకారంతో చదువులకు శ్రీకారం చుడతాం
మా మమకారంతో పదవికి ప్రాకారం కడతాం!


కామెంట్‌లు