ఓ మహాత్మా (కవిత)-------గుర్రాల.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

గాంధీ గాంధీ ఓ మా గాంధీ
మేము మెచ్చిన మహాత్మా గాంధీ
అందరూ మెచ్చిన నచ్చిన మన
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ !

పరతంత్ర దాస్యమును అవలోకించి
స్వతంత్ర ఆవశ్యకతను ఆలోచించి
సమరశంఖం మును పూరించారు
స్వాతంత్ర సమరము సాగించారు !

అహింసయే మన ఆయుధం అన్నావు
ఆ ఆంగ్లేయులను ఢీ కొన్నావు
మీ దెబ్బకు కుక్కిన పేనుల్లా మారినవారు
చచ్చిన పీనుగు లై ఇల మిగిలారు !

శాంతి సహనం సేవాభావం
పెంచుకొని పంచుకోవాలి మనం
ఇవేగాక గాంధీజీ రూపొందించిన
అందించిన సిద్ధాంతాల ఆగమనం !

ఈ లోకం విడిచి మీరు
మరి ఎక్కడికి వెళ్ళినారు
మీ చిరునామా తెలియక 
అంతా తికమక పడుతున్నారు !

మాకు కలలో నైనా కనిపిస్తావని
ఇలలో మమ్ముల మురిపిస్తావని
రాత్రనక పగలనక ఇక మేమంతా
మీ రాక కై చూస్తున్నాం దినమంతా 

ఆంగ్లేయులను మీరు జయించి
స్వాతంత్ర మును వెంటనే సాధించి
మాకు అందించారులే ఓ మహాత్మా
మిము విడిచి ఉండదులే మా ఆత్మ 

కామెంట్‌లు