మన బాపు సంకల్పం (కవిత):-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా

మన జాతిపిత బాపూజీ పుట్టింది
పోరుబందరు అను కు గ్రామములో
ఎదిగి పోరు సల్పుతూ కాలు పెట్టింది
భారత స్వాతంత్ర సమర సంగ్రామంలో !

స్వతంత్రించి యుద్ధభేరి మోగించారు
స్వాతంత్ర సమరాన్ని తాను సాగించారు
ఆంగ్లేయ పర ప్రభుత్వాన్ని ఎదిరించారు
వారి గుండెల్లో  సింహ స్వప్నమై నిద్రించారు!

స్వాతంత్ర్యం సాధించి మనకు అందించుటకు
అహరహం సమరం సాగించెను గా బాపూజీ
పరతంత్ర పలాయన మైన ఆంగ్ల ప్రభుత కు
స్వర తంత్రులు తెగేలా ఇబ్బంది కలిగించునుజీ !

ఓ బాపూ బాపూ చూడు నీవు మా వైపు
ఉండాలి మీరు మా ప్రక్కన రేపు మాపు
ఏది ఎక్కడ అ చురుకైన మీ చక్కని ఓ చూపు
మా గ్రామాల్లో పారిశుద్ధ్యం పనుల స్థితిగతుల వైపు !

దేశానికి పల్లెటూల్లే పట్టు కొమ్మలని అన్నావు
స్థిరంగా ఉండే మెట్టు దిమ్మెలై నిలవాలి అనుకున్నావు
మస్తు మస్తుగా ఆలోచించి కలలెన్నో నీవు కన్నావు
ఆ కలలన్నీ కల్లలైయేనని వగచి చింతించారు.

పారిశుద్ధ్యంపై దళితులకు అవగాహన కలిగించారు
బహుళ జన బృందంలో వారి విలువను పెంచినారు
సదా అలా జీవించాలని వారిని దీవించారు
యధాతధంగా ఆర్భాటం లేకుండా డా ఉండాలని భావించారు !

ఆంగ్లేయుల గుండెల్లో డప్పులనే కొట్టినారు
జైల్లో ఒంటరిగా ఉండి చెప్పు లనే కుట్టినారు
లేక పని పాకి పని అనకుండా మీరు చేసి చూపించారు
శ్రమ విలువను నిలువెత్తు శిఖరం పైన నిలబెట్టినారు!

.
కామెంట్‌లు