మా బతుకమ్మ పండుగ:-గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

వస్తున్నది వస్తున్నది మా బతుకమ్మ పండుగ
తెస్తున్నది తెస్తున్నది తాను ఆనందాలను నిండుగా
అత్తరు పన్నీరు ఆవుపేడతో వేదికను అలుకుదాం
ఆ తల్లికి మన మనసారా ఆహ్వానం పలుకుదాం !

మన బతుకులకు మెతుకు నిచ్చు
మన ముద్దుల బతుకమ్మకు స్వాగతం
మనమంతా ఆ తల్లికి చెప్పు దాము సుస్వాగతం
మనం అలసిసొలసి పోకుండా చెపుదాం ఘన స్వాగతం !

దుర్గామాతకు ప్రతి రూపం బతుకమ్మ తల్లి
మన మనసారా ఆ తల్లిని పూజిద్దాం మనం వెళ్లి
ఆశీర్వాదం పొందుటకు మనం స్మరించుకుందాం
 నైవేద్యం పెట్టుటకు విస్మరించకుండా ఉందాం!

మన ముందుకు వస్తున్నది
మన ముద్దుల బతుకమ్మ
మా పొందుకు చూస్తున్నది
మా ఈ సద్దుల బతుకమ్మ !

మా ఈ తెలంగాణ బతుకమ్మ
మా చెరువు కుంటల మెతుకమ్మ
మా మాగాన పసిడిపంటల పండి స్తుంది
మా బతుకులో మెతుకై మా ఆకలి తీరుస్తుంది !

మా ఊరి జనం దండి గాను
కూడి ఆడి నీ పండుగ చేస్తున్నరు
ఆనందంతో కలిసిమెలిసి వారంతా
మీ మోక్షంకై మెండుగ చూస్తున్నరు.

కామెంట్‌లు