మా తెలంగాణ బతుకమ్మ:-గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

బతుకమ్మా బతుకమ్మా
మా తెలంగాణ బతుకమ్మ
పూల బాణాల బతుకమ్మ
పూలతేరుపై నువు రావమ్మా!

బతుకమ్మా బతుకమ్మా
మా బంగారు బతుకమ్మా
మెతుకమ్మా మెతుకమ్మా
మా బతుకుల మెతుకమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
మా పల్లెల బతుకమ్మ
ఎల్లడగా నువు రావమ్మ
చల్లని చూపుల నీవమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
మా సద్దుల బతుకమ్మ
పలు విద్యల నియ్యమ్మా
విలువిద్యల బతుకమ్మ!

బతుకమ్మా బతుకమ్మా
పల్లె పడుచుల బతుకమ్మ
మాలోగిలి దేవత నీవమ్మా
మా ఎంగిలిపూల బతుకమ్మ !

బతుకమ్మా బతుకమ్మా
మా బంతి పూల బతుకమ్మ
మా ఇంటి ఇంతివై రావమ్మా
మా కంటి  కాంతివే నీవమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
మా సంతషి మాతవమ్మా
నవ వసంతాన్ని  తేవమ్మా
కవి కోకిలవై కూయవమ్మా !

బతుకమ్మా మా బతుకమ్మా
బయలుదేరి నువు రావమ్మా
మా బయలెల్లు బతుకమ్మా
మా ఎల్లల తల్లివి నీవేనమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
మా ధాన్యపు రాశివి నీవమ్మా 
ధన్యజీవియై జన్మించావమ్మా
మము కరుణించగ ఇక రావమ్మ!

బతుకమ్మా బతుకమ్మా
మా దుర్గామాతవు నీవమ్మ
మా కుల దైవం నీవేగదమ్మా
మా కల నెరవేర్చగ రావమ్మా !

మహా మాత వై నిలిచావు
దుర్గామాత వై గెలిచావు
ముల్లోకాలను నీవమ్మా
మా ముద్దుల బతుకమ్మా !

ఓ బతుకమ్మా బతుకమ్మా
బతికి నీవిక రావమ్మ
మా ఇష్టాలను కనుగొని నీవమ్మా
మా కష్టాలను తొలగించవమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
నీవేగా మా బతుకమ్మ
రుద్రుని రూపం నీవమ్మ
భద్రకాళి వై రావమ్మా. !

బతుకమ్మా బతుకమ్మా
బలే బలే మా బతుకమ్మ
వన సింగారపు బతుకమ్మ
జన అంగారం మెతుకమ్మా !

బతుకమ్మా బతుకమ్మా
మా పేరంటం బతుకమ్మ
దేవి గౌరివి నీవమ్మా
సవారి దేవతవై రావమ్మ !

కామెంట్‌లు