జమ్మి ఆకు ఆత్మీయ బంగారం;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
ఇంకా వాన కురుస్తూనే ఉంది
మొలక నవ్వు తడి మెరిసింది నేల
పచ్చని పొలాల మురిపెం విరిసింది  
పండుగల మనసు మురిసింది ఇల

తడి గుండెను ఒడిసి పట్టింది గాలి
మడి అలికింది మట్టి మొలక మది  
 పైరు నవ్వింది తంగేడు పూల వాసనతో

బోసి నవ్వుల్లో మొక్కైన బతుకు
పూసే పువ్వుల్లో పరిమళించే మొక్క
మనిషే ఒడిసి పట్టే నీటి చుక్కలను

ఆకులు రాలని అడవిలో మననసు
తీగల ఊయల లూగే చెట్టంచులపై 
ఆడపడుచుల సందడి ఆటలన్నీ 
 సద్దుల బతుకమ్మ పాటగా
ఆకుపచ్చని జమ్మి ఆత్మ బంగారం 
పిలిచేను పాలపిట్ట దసరా సరదాల 

చిటపట చినుకులు వానై మురిసే
గలగల పాటైన మా ఊరు కిలకిల నవ్వు
గువ్వలా ఎగిరింది మొక్కల చిగురేమో మారాకేసి
నదిలా ప్రవహించింది సంబరం మనసు నిండుగా 


కామెంట్‌లు