రక్తదానం :-భరద్వాజరావినూతల -కొత్తపట్నం టీచర్ జిల్లా -ప్రకాశం 9866203795

 53)సాహితీబృందావనవేదిక 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
*************************** 
2️⃣6️⃣1️⃣)
అన్నిదానాలలో గొప్పది  రక్తదానం 
 కాపాడును   మనిషి ప్రాణం 
ప్రాణాన్నికాపాడుటకు చెయ్యండి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣6️⃣2️⃣)
తల్లిస్తుంది మనిషికి జన్మ 
రక్తదానంతో పొందుతాడు  పునర్జన్మ 
అవుతావు నీవు అ పరబ్రహ్మ 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣6️⃣3️⃣)
జాతికుల మత భెధమెరుగనిది 
మానవత్వానికి దారిచూపుతుంది 
సంకోచించక చెయ్యండి అందరు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
************************  
2️⃣6️⃣4️⃣)
రక్తపోటునియంత్రణకు సహకరిస్తుంది 
ఆరోగ్యానికి ఆయువుపెంచుతుంది 
మంచిపనన్న  తృప్తి కలుగుతుంది 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
265)
అవయవదానం కన్నా మిన్న 
అందరిలో  రక్తమెరుపేకదన్న  
ప్రాణంనిలపటం  గొప్ప గెలుపే 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  

కామెంట్‌లు