శ్రీ కనక దుర్గ వైభవం "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌స్వర్ణ మయము  వర్ణము!
     సుందర మగు రూపము!
     వర్ణింతుము భవాని!
             ఓ కనక దుర్గ!
     ( శ్రీ కనక దుర్గ పదాలు.,)
🔱 శ్రీ దుర్గా భవాని స్వరూపము.. నిత్య శుద్ధ మైనది. బంగారు వన్నెతో; వికసించిన తామర పువ్వు వంటి ముఖంతో శోభించు చున్నది. ఈ చరాచర ప్రపంచమును.. మోహింప చేస్తున్నది. సాధకులకు.. తత్త్వ జ్ఞానము కలిగించు చున్నది.. ఈ జగదేక సుందరి.
🔱ప్రార్ధన పద్యము
      (ఆట వెలది)
              కనక మయము, నీదు కాయము, శుద్ధము,
              విశ్వ సుందరంబు, వికసిత వద
              నారవింద శోభ, అనుపమానం బగు,
              వినుత భువన సర్గ! కనక దుర్గ!
 ( శ్రీ కనక దుర్గా స్తవము.. విద్వాన్, శ్రీ బులుసు వేంకటేశ్వర్లు., )
👌శ్రీ దుర్గా భవాని!
     భవుని పత్ని! భవాని!
     వందనంబు భవాని!
               శ్రీమాత! శివాని!

కామెంట్‌లు