జయ దుర్గా భవాని! మహా గౌరి దుర్గ!"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌మహా గౌరివి  నీవె!
     సౌభాగ్య దాయినివి!
     నవ దుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
👌శ్రీ మాత.. సర్వ మంగళ గౌరీ దేవి. స్త్రీ లందరికి .. సకల సౌభాగ్యములు ప్రసాదించు చున్న జగన్మాత!
 
🙏పురాణ గాధ:
     పార్వతీమాత.. పరమేశ్వరుని పతిగా  పొందవలయు నని; త్రీవ మైన తపస్సు కావించినది. అందువలన, ఆమె దేహము...  కృష్ణ ( నలుపు) వర్ణ యైనది. పిమ్మట, ప్రసన్నుడైన శివుని దివ్యానుగ్రహము వలన, గౌర వర్ణ     ( బంగారు వన్నె) శోభిత యైనది. అందు వలన, "మహా గౌరి" అని, ప్రసిద్ధి కెక్కినది.
🔱"మహా గౌరీతి చాష్టమం" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఎనిమిదవది .. "మహా గౌరి దుర్గ"!
    ఓం శ్రీ దుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
    ( శ్రీ దుర్గా దేవి నామ మాలిక.,)

కామెంట్‌లు