జయ దుర్గా భవాని! సిద్ధి దాత్రి దుర్గ!"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌సిద్ధి దాత్రివి  నీవె!
     కైవల్య దాయినివి!
     నవ దుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
👌శ్రీ మాత.. భక్తి ముక్తి ప్రదాయిని! సాధకులకు .. అణిమాది అష్ట సిద్ధులను అనుగ్రహించు జనని.. శ్రీ దుర్గా భవాని! సిద్ధి అనగా మోక్షము. భక్త మహా శయులకు.. ఆ శ్రీ కైవల్య పదమును; శ్రీ మాత.. తన స్వరూపమగు ప్రకృతి ద్వారా ఘటింప చేయునది. కనుక, "సిద్ధి దాత్రి" అనిపేరు.
 
🙏ఆది పరాశక్తి అయిన జగదాంబ, దివ్యానుగ్రహము వలననే, పరమేశ్వరుడు.. సమస్త సిద్ధులను పొందు చున్నాడు; అని పురాణగాధ. పిమ్మట, శాంభవి.. మహా శంభునిలో అర్ధ భాగమై నిలిచింది. ఆ విధముగా పార్వతీ దేవి, పతి దేహము నందు.. ఎడమ భాగము పరి గ్రహించిoది. కనుక, "సామి సామేని చేకొన్న చాన" అని అచ్చ తెలుగు పదము!
🔱"నవమం సిద్ధి దాత్రీ చ" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో తొమ్మిదవది .. "సిద్ధి దాత్రి దుర్గ"!
    ఓం శ్రీ దుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
    ( శ్రీ దుర్గా దేవి నామ మాలిక.,)

కామెంట్‌లు