ఓం నమః శివాయై నమః శివాయ!!పార్వతీ పరమేశ్వరులు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098
 🙏"పార్వతీ ప"తి వీవె!
      "రమేశ్వరు"డవు నీవె!
       శ్రీ శివా! కేశవా!
            ఓ సాంబ దేవ!
       ( సాంబ దేవ పదాలు., )
     
👌మహాకవి కాళి దాసు, "రఘువంశం" మహా కావ్యము నందు వ్రాసిన "మంగళాచరణ శ్లోక" మిది.
🔱వాగర్దావివ సoపృక్తౌ
    వాగర్ధ ప్రతిపత్తయే!
     జగతః పితరౌ వందే
      పార్వతీ పరమేశ్వరౌ!!
    
👌 పార్వతీ పరమేశ్వరులే.. ఈ జగత్తుకు జననీ జనకులు. అట్లే, ఈ చరాచర ప్రపంచ సృష్టి  కార్యమునకు.. కారకు లు!  తల్లి దండ్రులు వంటి వారని అభి వర్ణించారు, కాళిదాసు.
👌 "పార్వతీప" అంటే.. పార్వతీ దేవికి భర్త యైన, "శివుడు" అని అర్ధం. "రమేశ్వరుడు" అంటే.. రమాదేవికి భర్తయైన, "కేశవుడు" అని అర్ధం. ఆ విధముగా, శ్రీ శివ కేశవు లిరువురకు.. రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాను, అని విశేషార్ధము!
🙏శ్రీ శివ కేశవ ప్రార్థన
          ( తేట గీతి )
        గంగ శిరమున, పదమున; కాల వర్ణ
        మర్రు, తనువున బూనిన, అమల మూర్తి;
        కామ సంహార దక్షు,డా కాము తండ్రి
        అయిన, "హరి హర నాథుని" ఆత్మ దలతు!!
             ( కాల వర్ణ మనగా "నలుపు వన్నె"; అర్రు అనగా "కంఠము" )
    ( విద్యా ప్రవీణ- భాషా ప్రవీణ., శ్రీ వేదుల సుందర రామ శాస్త్రి.,)
       ఓంనమః శివాయ! ఓం నమో నారాయణాయ!

కామెంట్‌లు