ధర్మ మొకటే జ్యోతి!; "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌అన్ని వేళల యందు
     జ్ఞాన వెలుగును నొసగు
     ధర్మ మొకటే జ్యోతి!
               ఓ తెలుగు బాల!
      (తెలుగు బాల పదాలు.,)
👌"ధర్మము" అంటే.. లోకములను ధరించునది. శుభములను కలిగించునది. కనుక, "పుణ్యము", శుభ కర్మ కలది. కనుక, "సుకృతము". మిక్కిలి ప్రశంసింప బడునది. కనుక, "శ్రేయసీ" అని, పేరులు.
👌"ధర్మ" మనగా, వేద విహిత మైన కర్మకు పేరు. "ధర్మ"శబ్దము... పుణ్యమునకు, నీతికి, స్వభావమునకు, ఆచారమునకు.. పేరు.
🔱ధర్మ మార్గమే.. ఉత్త మోత్తమ మైనది. సకల జను లందరికీ అత్యంత ఆవశ్యక మైనది. ఆచరణ యోగ్య మైనది. అందుకే, ధర్మ మార్గమును.. "జ్ఞాన ప్రకాశము కలిగించు జ్యోతి స్వరూపముగా" అభివర్ణించారు, మన మహర్షులు!
          🚩నీతి పద్య రత్నం
          ( తేట గీతి )
       చంద మామ దీపము, రాత్రి సమయ మందు;
         భాస్కరుడు దీప మగును, సుప్రభాత మందు;
       ధర్మమగు త్రిలోకములకు, తాను దివ్వె;
       తేజముగ సుపుత్రుడు, కుల దీప మగును
       
       ( నీతి గీతములు., డా. మలయ శ్రీ.,)

కామెంట్‌లు