ఓం నమః శివాయ! ఏకాదశ రుద్రులు! "శంకర ప్రియ.," శీల., సంచార వాణి: ,99127 67098

 ఏకాదశ మూర్తుల
     విలసిల్లు చున్నావు!
      ఏకైక నాథ! శివ!
                 ఓ సాంబ దేవ!
     ( సాంబ దేవ పదాలు.,)
    
👌పరమేశ్వరుడు.. ఒక్కడే! పార్వతీ పతి! అందరిలో నున్న చైతన్య శక్తి.. జీవాత్మ! ఏకాదశ రుద్ర స్వరూపులకు నియామకుడు.. జీవేశ్వరుడు!
👌మనమంతా.. మనస్సు ద్వారా; పంచ కర్మేంద్రియములు, మరియు, జ్ణానేంద్రి యములు.. వెరసి (1+5+ 5=11) పదనొకండు ఇంద్రియము లతో; లోక వ్యవహారం కొనసాగించు చున్నాము! ఇంద్రియ సుఖాను భూతిని పొందుచున్నాము.
👌అవి.. "ఏకాదశ రుద్రులకు ప్రతీకలు" గా;  పేర్కొను చున్నారు, మంత్ర ద్రష్టలైన, మన మహర్షులు! పాంచ భౌతికమైన శరీర శుద్దికొఱకు; "సకలీకరణము" విధానమును ఏర్పర్చారు.
🙏శ్రీ మహా రుద్ర ప్రార్థన
          ( తేట గీతి )
        పదనొకండు మూర్తులుగ, విభక్త దేహు
       డయిన, శివుని, శుద్ధ స్ఫటికాకృతి యగు
      సత్ప్రకాశు, తేజోనిధి, చంద్రమౌళి
      తలతు రుద్రుని, భవుని చిత్తంబు నందు!!
    ( మధుర కవి, శ్రీ దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,)
       ఓంనమః శివాయ! ఓం నమో భగవతే రుద్రాయ!
కామెంట్‌లు