ఓం శివాయ గురవే నమః! విశ్వ గురు మూర్తి! "శంకర ప్రియ.," శీల., సంచార వాణి: ,99127 67098
 విశ్వ గురుమూర్తి యగు
     శంకరాచార్యు నకు
      విజయము కలుగు గాక!
                 శివ మస్తు! శ్రీ రస్తు!
     ( శివ మస్తు పదాలు.,)
    
👌ఆది శంకరాచార్య స్వామి.. సనాతన మైన, మన ఆర్ష ధర్మమును బహుళ ప్రచారం కావించిన "మహా మనీషి"! గురువులకు గురువు.. జగద్గురువు!
👌శ్రీ స్వామి వారు.. మన భరత ఖండము, కేరళలో నున్న.. "కాలటి" గ్రామము నందు అవతరించారు. యావత్ భారత దేశము నందు.. చతు రామ్నాయ మఠము లను; నాలుగు దిక్కు లందు నెలకొల్పారు. హిమాలయ పర్వత శ్రేణులలో నున్న,  కేదార గుహలలో అంతర్ధాన మైన, విశ్వ గురు మూర్తి..  "అపూర్వ శంకరులు"! సర్వ సంగ పరిత్యాగి యైన... శ్రీ స్వామి వారికి.. "భారతీయ ధర్మము పరిరక్షణము కొరకు విజయ మగుగాక"!
🔱అవ తీర్ణశ్చ కాలట్యామ్
     కేదా రేంతర్హితశ్చ యః
     చతుష్పీఠ ప్రతిష్టాతాం
     జయతాం శంకరో గురు:!
🙏జగద్గురు ప్రార్థన
          ( తేట గీతి )
        విశ్వ జనత కాధ్యాత్మిక భిక్ష పెట్టి,
       జాగృతంబును కావించె, జగతి నంత!
      సత్య ధర్మ సంస్థాప నాచార్య వరుడు,
      ఆది శంకరుడు, మనకు మార్గ దర్శి!!
    ( మధుర కవి, శ్రీ దేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,)

కామెంట్‌లు