జయ దుర్గా భవాని! బ్రహ్మ చారిణి దుర్గ! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌బ్రహ్మ చారిణి వీవె!
     అక్ష మాలివి నీవె!
     నవదుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
👌శ్రీమాతా శివాని.. ఉమాదేవి. అందరినీ రక్షించునది. 
👌పార్వతీ మాత.. పరమేశ్వరుని భర్తగా పొందవలెనని నిశ్చయించు కొన్నది. తదనుగుణముగా, తీవ్రమగు తప మొనరించుటకు ; "బ్రహ్మ చారిణి" గా బయలు దేరింది. అప్పుడా తల్లి అయిన మేనకాదేవి.. "ఉ (అనగా ఓ బిడ్డా!).. మా (అనగా, వలదు ) అని, పిలిచింది. అందువలన "ఉమా" దేవి అని పేరు వచ్చింది.
🙏  బ్రహ్మ మనగా జ్ఞాన, విజ్ఞాన ప్రదమైన వేద స్వరూపము... పరమేశ్వరి. ఆ వేదము నందు చరించు నది. కనుక "బ్రహ్మ చారిణి" అని పేరు!
🔱"ద్వితీయం బ్రహ్మ చారిణి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో రెండవది .. "బ్రహ్మ చారిణి" దుర్గ!
👌శ్రీ దుర్గా భవాని!
     భవుని పత్ని! భవాని!
     వందనంబు భవాని!
               శ్రీమాత! శివాని!
కామెంట్‌లు