జయ దుర్గా భవాని!చంద్ర ఘంట దుర్గ! "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌చంద్ర ఘంటవు నీవె!
     ఆహ్లాద కరి వీవె!
     నవదుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
👌శ్రీ మాత.. అభయ ప్రదాయిని! చంద్రుని శిరో భూషణముగా దాల్చినది, ఆహ్లాద కారిణీ దేవి.
🙏పరమేశ్వరి.. సమస్త మైన ప్రాణికోటికి, ఆహ్లాదమును అనుగ్రహించునది. అట్లే, సర్వేంద్రియము లకు ఉత్సాహమును, మనస్సునకు ఉల్లాసమును; మరియు, సాధకు లందరికి బ్రహ్మానందమును కలిగించునది. కనుక, దుర్గా మాతకు  "చంద్ర ఘంట" అని పేరు.
🔱"తృతీయం చంద్ర ఘంటేతి!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో మూడవది "చంద్ర ఘంట దుర్గ"!
    ఓం శ్రీ దుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
    ( శ్రీ దుర్గా దేవి నామ మాలిక.,)
కామెంట్‌లు