బాల త్రిపుర సుందరీ దేవిఅమ్మవారి స్తుతి:-మచ్చ అనురాధ--సిద్దిపేట9948553223.

 (శరన్నవరాత్రుల సందర్భంగా)
సీసమాలిక
ముగ్గురమ్మల లోన మూలపుటమ్మవు
జనుల రక్షించెడి జనని నీవె,
జగదీశ్వరీ దేవి జయము లో సగినావు
రాక్షసు మర్దించి రమ్యముగను,
ననలగర్భితమైన యాదిపరా
శక్తి
నభయ హస్తముతోడ నద్భుతమ్ము,
కోరికలను తీర్చె కొంగు బంగారమై
బాలత్రిపుర దేవి భవ్య ముగను,
సింహ వాహనమెక్కి శీఘ్రమే రావమ్మ
బాధలు తొలగించ పాహి పాహి,
కలియుగ పాపాలు కడ తేర్చుటకు దేవి
కనకదుర్గమ్మ వై కదలి రమ్ము ,
నిత్య కళ్యాణి వి నీరజనయనివి 
లోక కళ్యాణివి లోకమాత ,
భక్తిశ్రద్ధలతోడ భావ మందుననిల్పి
నిత్య పూజలు జేతు నియతిగాను ,
మంగళ రూపమ్ము మాయమ్మ మోమును
కాంచిన తొలగించు కష్ట ములను.
ఆటవెలది
అర్ధచంద్ర బొట్టు నమ్మముఖముపైన,
శూల ధారివైయ్యి యేలు జగము ,
చంద్రబింబ కాంతి చండీశ్వరీరూపు ,
వర్ణ తరము గాదె వారి సాక్షి .

కామెంట్‌లు