బతుకమ్మ గేయం;-చాపలమహేందర్9949864152
సిబి తీగెలసిబికి
గుమ్మడి ఆకు గురువు గా వచ్చే
తంగేడు పువ్వుతైతక్కలాడే 
గునుగు పువ్వు ముసిముసి నవ్వే
ముత్యాల పువ్వు మురిపంగా మురిసే

చామంతి పువ్వు చకచకా వచ్చే
పట్టుకుచ్చుల పువ్వు పరేషాన్ అయ్యే
బంతి పువ్వులు ముద్దుముద్దుగా వచ్చే
పువ్వులన్ని పువ్వుల వనమా యే

బంగారు బతుకమ్మ గా మారే
తమలపాకు అతిథిగా వచ్చే
పసుపు కుంకుమ గౌరమ్మ మాయే
ఆడబిడ్డల ఆటపాటలు తో

సంబరాలు చేసుకునేరు
ముత్తయిదువులు అందరూ 
వాయినాలు ఇచ్చి పుచ్చుకునేరు

బంగారు బతుకమ్మ 
     గంగమ్మ ఒడి చేర్చేరు
సద్దుల బతుకమ్మ
 చల్లంగా పోయిరావమ్మా


కామెంట్‌లు