బతుకమ్మ:-చాపలమహేందర్9949864152

 చేను చేలకల్లో
పూసిన పువ్వులు
సంచుల్లో నింపి
ఊరు వాడ
పువ్వుల జాతరై
తీరొక్క పువ్వు లు
సింగిడిగా వెలిసే
 ఒక్కొక్క పువ్వు
ఒక్కొక్క దొంతరలుగా పేర్చి
ప్రకృతి మణిహార మైనా
పువ్వుల హారము
బతుకమ్మ తల్లి గా
కొలువుదీరినావు
తెలంగాణ ఆడబిడ్డల
ఆత్మీయ బంధువై నిలిచి
ఊరు వాడ బతుకమ్మ
సంబరాలలో  మునిగి
ఆటల్లో పాటల్లో
నీ నామస్మరణ
మార్మోగుతుంది
గౌరమ్మకు తోడై
గంగలో కలిసేవు
భక్తి శ్రద్ధలతో
నిన్ను కొలిచెదను
మమ్మల్ని చల్లగా చూడమ్మా
చక్కనైన ఓ బతుకమ్మ

కామెంట్‌లు