కీళ్ళనొప్పులు ( Arthritis ) -1;- పి . కమలాకర్ రావు
 కీళ్ల నొప్పులను  ప్రారంభ దశ లోనే
గుర్తించి జాగ్రత్త పడితే తగ్గుముఖం
పడతాయి. అశ్రద్దచేస్తే కొంతకాలానికి మొండి జబ్బుగా మారి శరీరం లోని అన్ని joints లో చేరి చాలా ఇబ్బంది పెడుతుంది.
నొప్పులు తగ్గించుకోవడానికి మనం తీసుకునే ఆహారం ఎంతో సహాయ పడుతుంది.
 గోబీ పువ్వు ( Cauli flower ) ను బాగా కడిగి ముక్కలుగా చేసినీరు పోసి జిలకర పొడి, మిరియాలాపొడి వేసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించి సూప్ గా తయారు చేయాలి. ఇది త్రాగితే
కీళ్ల నొప్పులు తగ్గి పోతాయి.
ఓ నాలుగు పారిజాతం ఆకులు కడిగి ముక్కలుగా త్రుంచి నీటిలో వేసి జిలకర, మిరియాల  పొడి వేసి
కాషాయంగా చేసి త్రాగితే నొప్పులు
త్వరగా తగ్గి పోతాయి.
చేతి వేళ్ళల్లో, కాలి వేళ్ళల్లో నొప్పులు  తగ్గాలంటే, పసుపు, జిలకర, తాటి బెల్లం వేసి నీరు పోసి
మరిగించి చల్లార్చి త్రాగాలి.
ఆహారంలో పసుపు, వెల్లుల్లి
ఎక్కవగా వాడాలి.

కామెంట్‌లు