కీళ్ల నొప్పులు (Arthritis)తగ్గడానికి..-5;- పి . కమలాకర్ రావు
 కీళ్ల నొప్పుల తైలం తయారీ విధానం....
దాదాపుగా ఒక అరకిలో తైలం తయారు చేయడానికి సుమారుగా
కావలసిన వస్తువులు.
1. మంచి నువ్వుల నూనె 600 ml (పూజానూనె పనికి రాదు )
2. అలోవెరా పట్టాలు రెండు.
3. వెల్లుల్లి ముద్ద  50 gr.
4. అల్లం ముద్ద    50gr.
5. లవంగాలు  2 spoons.
6. పసుపు      2 spoons.
7. మెంతులు   2 spoons.
8. ఆవాలు      2 spoons.
9. ఓమ  లేక వాము 2spoons.
10. భీమ్ సేని కర్పూరం
        2 spoons.
ముందుగా అలోవెరా పట్టాల లోని
గుజ్జును తీసి విడిగా పెట్టుకోవాలి.
ఒక మూకుడులో నువ్వులనూనె పోసుకొని చిన్నమంట పై వేడి చేయాలి. నూనె కాగుతున్న కొద్ది
పై వస్తువులను ఒక్కొక్కటిగా వేయాలి. చివరగా అలోవెరా గుజ్జు
వేసుకోవాలి. మాడకుండా జాగ్రత్త పడాలి. అన్నివేగిన తర్వాత దించేసి చల్లారిన తరువాత చివరలో భీమ్ సేని కర్పూరం వేసి
బాగా కలుపుకోవాలి. వేరే పాత్రలలో నిలువచేసుకోవాలి.
24 గంటలు దాటిన తరువాత దీన్ని వాడుకోవచ్చు.
దీన్ని కీళ్ల నొప్పులపై రాసుకుంటే
చాలా అద్భుత మైన మార్పు కనపడుతుంది. అన్నిరకాల నొప్పులపై పనిచేస్తుంది.
దీన్ని తలనొప్పి కి మందుగాకూడా
వాడుకోవచ్చు.
    

కామెంట్‌లు