పాఠశాల ;- కంచనపల్లి ద్వారకనాథ్,BA.,BFA, చరవాణి: 9985295605


  పొద్దున్నే  కాఫీ తాగుతూ పేపరు`చదువుతున్న  సూర్యారావు చిరాకుపడ్డాడు . తనలో తాను పొద్దున లేస్తే పేపర్   నిండా నేరాలు ,ఘోరాలు  టీవీ ఆన్ చేస్తే అవే    పదే పదే  చూడాల్సి  వస్తోంది .అని   ఈ లోకం  ఎప్పుడు బాగుపడుతుందో  ఏమో అని  గొణుక్కుంటు౦డగా   .అక్కడికి తన కొడుకు  రాధాకృష్ణ  వచ్చాడు .. “ఏమిటి నాన్న ఏదో  మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ? “:  అన్నాడు  . “  ఏమి లేదు  ఈ పేపర్ చూడు దీని  నిండా    నేరాలు , ఘోరాలు  పొద్దున్నే   చూడలేక , చదవలేక ఏదో   గొణుక్కుంటున్నా ..  అయినా మనిషికి ఆయువు  వంద   సంవత్సరాలు . అందులో సగం  నిద్రకి పోగా, యాబై ఏళ్ళు వచ్చాక  వచ్చే రోగాలు , నొప్పులు రానే   వస్తాయి . .    రోజు ఆకలి   తీర్చు కోవడానికి  పట్టెడు అన్నం , కట్టుకోవడానికి ఇంత గుడ్డ ,చాలదా ?  “ అన్నాడు ఇవన్నీ  తెలిసి గూడా వీళ్ళు నేరాలు చేసి ఏమి  సాధిస్తామనుకుంటున్నారు .అర్థం కావడం లేదు . “ అన్నాడు  నాన్న .. మీలా అందరూ   ఆలోచించరు .  ప్రతి నేరానికి   ఏదో ఒక కారణం వుంటుంది . అసలు మనిషి పుట్టుక తోటే మంచివాడు , నేరస్థుడు గా ఎవ్వరూ కారు  పుట్టిన ప్రతి వాడి కి మొదటి గురువులు . తల్లి , తండ్రి ,తర్వాత మంచి ఉపాద్యాయుడు .అందుకే అన్నారు ‘బావి పౌరుల భవిష్యత్తు తీర్చి  దిద్దబడేది తరగతి గదులలోనే ‘   అని  అన్నారు.  పుట్టిన  ప్రతి మనిషి పైన పెరిగే వాతావరణం , , పరిశరాల  ప్రభావం వుంటుంది . అదే తన   భవిష్యత్తుకు   పునాది  అవుతుంది . ఇది మంచి ఇది చెడు అని గ్రహించి వాడు ఎన్నుకునే మార్గాన్ని బట్టి వాడు  సంఘం లో స్థానo  ఏర్పడుతుంది . దురలవాట్లు , చెడు స్నేహాలు ,వల్ల నేరస్తులుగా తయారు అవుతారు . “ అన్నాడు . ఐతే  ఈ పరిస్థితిని మార్చే మార్గమే లేదా  ? అన్నాడు  .  సూర్యారావు . “  ప్రతి   సమస్యకు ఏదో ఒక  పరిష్కారం, వుంటుంది ...  అలాగే  ప్రతి  పిల్ల  వాడు మంచి  ఉపాధ్యాయుల వద్ద చదువుకుని మంచి పౌరులుగా తీర్చి దిద్ద బడాలి . పేద  కుటుంబం నుoడి వచ్చిన అబ్ధుల్  కలాం   , అంబేడ్కర్ లాంటి వాళ్ళు  వాళ్ళకున్న బాధలు , సమస్యలు అధిగమించి   చదువుకుని  దేశానికి ఎంతో కీర్తి తెచ్చి పెట్టారు .  అందుకే . నేరాలు   ఘోరాలు   తగ్గాలంటే  అందరూ  విజ్ఞాన వంతులు  కావాలి , మంచి  చదువులు  చదవాలి . అందుకే ‘ఒక పాఠశాలను  ప్రారం భిస్తే ఒక చెరసాల మూసివేయడానికి  అవకాశం కల్పించి నట్లే ‘ అని విక్టర్  హ్యూగో అన్నాడు . “ అన్నాడు .   “  అద్భుతంగా చెప్పావ్ .. మనం మనకున్న స్థలంలో మంచి పాఠశాల  కట్ట బోతున్నాం “ అన్నాడు సంతోషంగా .సూర్యారావ్.  ఈ మాటలు విన్న  ఇంట్లో అందరూ అన్నిదానాల్లోకల్ల    విద్యా దానం గొప్పది...   మేము  చదువుకుని  ఊరికే వున్నాం , ఆ స్కూల్లోనే పని చేస్తాం అన్నారు .   

                                        


కామెంట్‌లు