వృద్ధుల దినోత్సవం:-- జయా

చిగురించిన విత్తనం
మొక్కై 
మానై
మనసున
పువ్వులు పూయించి
సీతాకోకచిలుకలకు 
అర్పించి
కాయలై
పండ్లయి ఈరోజు
ఆకులు రాలిన చెట్టయి
ఒంటరిగా పరితపిస్తోంది
ఏకాకై నడుస్తోంది

యవ్వనమేమో 
తనకంటూ ఓ తోడొచ్చాక
తన మూలాన్ని మరచిపోయింది

నాటిన విత్తనాన్ని
వేరునీ మరవడం సబబా

అంతులేని ఆలోచనలను
మనసుకే పరిమితం చేసి
నిన్నే తలచి 
నిన్నే నడిపించిన 
కన్న తల్లిదండ్రులను
నిర్లక్ష్యం చేయడం
తగునా

కాలాన్ని
కూలిపోనివ్వక
చూసుకోవడం
తప్పనిసరి

నీకూ 
కాలం పండవుతుంది
అప్పుడు
నువ్వూ ఏకాకివైతే
నీ పరిస్థితేమిటో
ఆలోచించు

మనసులో ఉంచుకో
మూలాన్నే 
తొలగిస్తానంటే 
ఉండదు ఆనందం


కామెంట్‌లు