*జలమణిపూసలు*:-*మిట్టపల్లి పరశురాములు*

దాహముతీర్చుటకుజలము
విటమినులుమేనుకుబలము
పుడమినీరులేనియెడల
మనముజగతిబ్రతుకలేము

వానజల్లు కురువంగా
బిరబిరనీరుపారంగా
వాగులువంకలుదూకంగా
నిండుగనిండెమాగంగా

నీటి చుక్కనొడిసిపట్టు
పుడమిఒడిలొదాచిపెట్టు
మానవజీవనకవియే
ఆరోగ్యమును నిలబెట్టు

జలమెవిశ్వపునాధారం
జలమె ప్రాణులకాధారం
నీరులేనిపుడమిలోన
బ్రతుకుటయెనొకభారం
            ***

కామెంట్‌లు