బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 61) జ్ఞానం మేధావిని వినయవంతుడిని చేస్తుంది.అదే సామాన్యుడిని ఆశ్చర్యపరుస్తుంది.అవివేకిని గర్వితుడిని చేస్తుంది.
62) నీ ప్రతి మాటా,ప్రతి ఆలోచనా, ప్రతి పనీ నీ విధిని నిర్వచిస్తాయి.అవి మంచివైతే నిన్ను కాపాడుతాయి.చెడువైతే ఆకలిగొన్న పులి లాగా మీదపడుతాయి.
63) పశువును మానవుడిగా, మానవుడిని మాధవుడిగా మార్చేదే నిజమైన మతం.
64) ఒకటన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఒక ఔన్సు అనుభవం గొప్పది.
65) గతాన్ని తవ్వి నీ శక్తిని వృథా చేయకు.వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాడు.
(సశేషము)
 
కామెంట్‌లు