శ్రీ మహా భాగవత పోతన మణిపూసలు :-...వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సిద్దిపేట.

మునుకొని తా పుత్ర రూపంబునను 
తన ధర్మ పత్ని కలియుట వలనను 
పుట్టును తల్లి పుడమి గర్భమున 
దీపము దీపాలుగ మారగాను      7821 

ఆత్మ స్వరూపుడైన తానును 
కుమారుండుగా జన్మించును 
అని వేదాలు పలుక వినవే 
కాపాడుము నన్ను దయ తోడును      7822 

మనసులనెరింగిన మా తండ్రియు 
మీకిచ్చి వివాహమును జేసియు 
పదమూడు మందిని మిమ్మును 
వరించితిమి, మన్నించె తండ్రియు      7823 

అనేక సార్లు దీనంబుగాను 
దితి తన నాథున్ని బ్రతిమాలెను 
సల్లాపమున కశ్యపుడు పలికె 
పతివ్రతైన తనసతి తోడను       7824 

అంగనల వలననే పురుషులకును 
ధర్మార్థ కామములు సిద్ధించును 
నావికుడు దాటును నావతోడ 
తనతోను ఇతరులను దాటించును     7825 

................

కామెంట్‌లు