తైమూరు ఓటమి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపిల్లాడిపేరు బలకరణ్.తీరిగ్గా కూర్చుని చాకుకి పదును పెడుతుంటే  తల్లి కల్యాణి అడిగింది "ఏమిటిరా నాయనా ఈపని?ఈవేళ నీపుట్టినరోజు.11నిండి 12వ ఏట అడుగు పెట్టబోతున్నావు.దీర్ఘాయుష్మంతుడవై కీర్తి సంపాదించాలి.""మరి నాకు ఏంచేస్తావు?" "తలంటిపోసి  దేవుని కుంకం చందనం దిద్దుతా.ఖీర్ తయారు చేస్తా."
బలకరణ్ పాలు తేవటానికి బైటికి వెళ్లాడు. ఆరోజుల్లో తైమూరు మనదేశం ని కొల్లగొడుతున్నాడు.తురుష్కులు దొరికింది దొరికినట్లుగా ప్రతి ఇల్లు లూటీచేస్తున్నారు.తలుపులు విరగకొట్టి మరీ దోచుకున్నారు. ఇంటి లో వారు భయంతో  కలుగులో ఎలుక లాగా  దాక్కోటం పారిపోటం చేస్తున్నారు. కల్యాణి  అంతకుముందే  పారిపోయి కొడుకు కోసం  అల్లాడసాగింది.తైమూరు భటులు ఆమె చేసిఉంచిన మిఠాయిలు చూసి లొట్టలేస్తూ ఖాళీ చేశారు. ఇంతలో తైమూరు కాలుఈడ్చుకుంటూలోపలికి వచ్చి వారిని నిందించసాగాడు."నేను ఆఫ్ఘనిస్తాన్ తర్వాత హిందుస్తాన్ని కొల్లగొట్టాలని వచ్చాను.మీరు తిండికి మొహంవాచి మిఠాయిలు మింగుతున్నారా?"వారిని తరిమేశాడు.సరిగ్గా అప్పుడే  బాలకరణ్"అమ్మా!పాలుతెచ్చాఖీర్ కోసం  "అని లోపలికి వచ్చాడు. "ఎవడివిరా నీవు?మాఅమ్మ ఏదీ?" "నేను తైమూరుని నీపాలిటి యముడిని".ఆపిల్లాడిచేతిలోని  పాలముంతను లాక్కుని  తాగ బోతుండగా బలకరణ్ రెచ్చిపోయాడు. "మాఅమ్మని ఏంచేశావు చెప్పు.నిన్ను నాచాకుతో చంపేస్తా.ఇందాకే పదును పెట్టాను."తైమూరు  వాడి సాహసానికి ముగ్ధుడయ్యాడు. "శభాష్ బేటా! నీధైర్య సాహసాలు నాకు నచ్చాయి. నన్ను ఎదిరించిన ఏకైక మొనగాడివి నీవే!నీకు ఏం బహుమతి కావాలి?" "ముందు  మా పల్లెను విడిచి వెళ్లిపో" వెంటనే  తైమూరు ఆప్రాంతంని సైన్యంతో విడిచిపెట్టాడు.ఇంతలో  కల్యాణి ఏడుస్తూ వచ్చింది. "నాకన్నతండ్రీ!నీకోసం ఆరాట పడుతున్నా! అయ్యో!నీచేతి కి గాయం!హమ్మో రక్తం!" "అమ్మా! తైమూరు కి నాసాహసం చూపాలని కావాలి అనే నాచేయి చాకుతోకోసుకుని వాడిపై లంఘించబోయాను.అంతే తోకముడిచాడు.అమ్మా!ఈరక్తంతో నానుదుట తిలకం దిద్దు." వాడిని తల్లి గుండెలకు హత్తుకున్నదని వేరే చెప్పాలా!?
కామెంట్‌లు