'బాల్యము' భాగ్యము;---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
బాల్యము బంగారము
చాలా సింగారము
విరిసిన మందారము
బ్రతుకున మకరందము

రక్షణ ప్రాకారము
బాల్యము ఆధారము
మంచికి శ్రీకారము
శుభకర ఓంకారము

తూర్పున సింధూరము
చింతలు బహు దూరము
చక్కని చిరు ప్రాయము
అత్యంత అమూల్యము

సాటిలేని బాల్యము
జీవితాన భాగ్యము
అన్నింట్లో శ్రేష్టము
బాల్యమనిన స్వర్గము


కామెంట్‌లు