మేలిమి ముత్యాలు;--గద్వాల సోమన్న
నాన్న మనసే వెన్న
అపురూపము త్యాగము
కుటుంబంలో మిన్న
ఇంట స్వర్గధామము

అమ్మ మాట చల్లన
వెన్నెల జల్లుల్లా
ఆమె మనసు తెల్లన
విరిసిన మల్లెల్లా

తెలుగు జూడ అందము
నోటికదే తీయన
జాబిలమ్మ చందము
ఎదుగుదలకు నిచ్చెన

కడు మాధుర్యము
సినారె పాటలు
బహు తెలుగుదనము
పరిమళ తోటలు

మితిమీరిన కోపము
బంధాలను చెరువును
కల్గియున్న శాంతము
మిత్రులుగా చేయును

వెలగలది  సృష్టిలో
స్నేహమే జీవితము
పెట్టుకొనును మదిలో
మహిని జీవజలము

కష్టపడితేనే
బ్రతుకులో విజయము
మంచి చేస్తేనే
దొరుకునోయ్ !పుణ్యము
 
తొలకరి చిరుజల్లులు
పంచుతాయి మోదము
పిల్లలు హరివిల్లులు
సదనములో అందము 

కామెంట్‌లు