: వేదవ్యాసుడు- కవి గురువు (పద్యములు)- ఎం. వి. ఉమాదేవి:నెల్లూరు
 ఆ/వె
వేద సారమెల్ల విభజించి నాల్గుగన్ 
సులభతరము జేసె సూక్ష్మముగను 
రచన లోన నీతి రమ్యమగునటుల
మహా భారతమ్ము మరియు వ్రాసె!
!!తే.గీ!!
సకల విద్యల నెరిగిన సాధుమూర్తి 
భక్తి యోగము తెలిసిన భవ్యగురువు 
పామరులకును నెఱిగించె  పరమవిభుని 
సంప్రదాయమ్ము తెలిపెను చక్కగాను!

కామెంట్‌లు